MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 3:52 am Digital Edition : Medak Today

బీరంగూడ గుట్ట జాతర విజయవంతం: పోలీసు, జిహెచ్ఎంసి అధికారులకు ప్రసాదాలు అందజేసిన ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్.

అమీన్‌పూర్,ఫిబ్రవరి,23,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలో బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి మహాశివరాత్రి జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించిన ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఉత్సవాల విజయవంతానికి సహకరించిన పోలీస్ మరియు జిహెచ్ఎంసి అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. జాతర ముగింపు సందర్భంగా వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.జాతరలో లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ , శేరిలింగంపల్లి జోన్
డీసీపీ శ్రీనివాస్ , జోన్ అడిషనల్ డిసిపి ఉదయ్ రెడ్డి ,రామచంద్రపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్, మరియు క్షేత్రస్థాయిలో బందోబస్తును సమన్వయం చేసిన అమీన్‌పూర్ సిఐ నరేష్ ని చైర్మన్ సుధాకర్ యాదవ్ ప్రత్యేకంగా కలిశారు. అలాగే పారిశుధ్యం, ఇతర మౌలిక వసతులను పర్యవేక్షించిన అమీన్‌పూర్ జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ కి కూడా స్వామివారి శేషవస్త్రం కప్పి, ప్రసాదాలను అందజేశారు.

చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ:

  • మహాశివరాత్రి జాతరను ఒక పండుగలా, క్రమశిక్షణతో నిర్వహించడంలో పోలీస్ యంత్రాంగం మరియు జిహెచ్ఎంసి అధికారుల కృషి మరువలేనిది. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్, డీసీపీ, ,అడిషనల్ డిసిపి, ఏసీపీ, మరియు సిఐ నరేష్ పర్యవేక్షణ అద్భుతంగా ఉంది. అందుకే ఆలయ కమిటీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుతూ స్వామివారి ఆశీస్సులు అందజేశాము.ఈ కార్యక్రమంలో ఆయన చైర్మన్ సుధాకర్ యాదవ్‌తో పాటు దేవాదాయ శాఖ జూనియర్ అసిస్టెంట్ మల్లికార్జున్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, మహేష్, శ్రీనివాస్, రమేష్ యాదవ్, మరియు ఇతర ముఖ్య అనుచరులు పాల్గొన్నారు. అధికారుల సమన్వయం మరియు చైర్మన్ గారి సమర్థవంతమైన పర్యవేక్షణలో ఈ ఏడాది జాతర ప్రశాంతంగా ముగిసిందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.