బీరంగూడ అయ్యప్ప ఆలయ నిర్మాణానికి సాయి భజన మండలి భారీ విరాళం.
అమీన్ పూర్, ఫిబ్రవరి,01,(మెదక్ టుడే) న్యూస్: ప్రతినిధి.భక్తికి నిలయమైన బీరంగూడ గుట్టపై నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ మహాత్కార్యంలో భాగంగా, ఆర్.సి.పురం మల్లికార్జున నగర్‌కు చెందిన సాయి భజన మండలి సభ్యులు తమ వంతు సహాయంగా 1,11,116/- (అక్షరాలా లక్షా పదకొండు వేల నూట పదహారు రూపాయలు) విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు.ఈ సందర్భంగా సాయి భజన మండలి ప్రతినిధులు మాట్లాడుతూ.. "మన బీరంగూడ గుట్ట పైన అయ్యప్ప స్వామి దేవాలయం...