బీరంగూడ ఆలయంలో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు: కన్నుల పండువగా వసంతోత్సవం, మహా అన్నపూజ.

అమీన్పూర్,ఫిబ్రవరి,17,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మహారుద్రాభిషేకం.. వసంతోత్సవం ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మహారుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నిర్వహించిన వసంతోత్సవం కన్నుల పండువగా సాగింది. రంగురంగుల వసంతాలతో స్వామివారిని ఆరాధిస్తూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున...