MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 3:00 pm Digital Edition : Shiva Kumar

బైక్ లు ఢీ .. ఒకరు మృతి.

పాపన్నపేట,ఆగస్టు,10, మెదక్ టుడే న్యూస్:రెండు బైక్ లు ఢీ కొని ఒక వ్యక్తి మృతి చెందారు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యుసుఫ్ పేట శివారులో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు..మెదక్ – బోడ్మట్‌పల్లి ప్రధాన రహదారి యూసుఫ్ పేట శివారులో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది . పాపన్నపేట గ్రామానికి చెందిన ఆకుల కృష్ణ (40) పని నిమిత్తం బంధువు వెంకట్ తో కలిసి కొత్తపల్లి వైపు నుండి పాపన్నపేటకు ద్విచక్ర వాహనం పై వస్తుండగా,ముస్లాపూర్ గ్రామానికి చెందిన వారు ద్విచక్ర వాహనంపై మెదక్ వైపు వెళ్లే క్రమంలో ఎదురెదురుగా వారి వాహనాలు బలంగా ఢీకొన్నాయి.ఈప్రమాద ఘటనలో ఆకుల కృష్ణ కు తీవ్ర గాయాలై మరణించాడు. కృష్ణ పాపన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో (సిబ్బంది) కారోబార్ గా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్య సంగీత,ఒక కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.