రామచంద్రాపురం,ఫిబ్రవరి,26,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.బిహెచ్‌ఎల్ హెచ్‌ఆర్‌డీసీ విభాగంలో అదనపు ఇంజనీర్‌గా సుదీర్ఘ కాలం సేవలందించిన తోట వెంకటస్వామి పదవీవిరమణ సందర్భంగా హెచ్‌ఆర్‌డీసీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తన విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వెంకటస్వామిని సహచర ఉద్యోగులు, అధికారులు ఘనంగా కొనియాడారు.
సేవలు చిరస్మరణీయం:
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ.. బిహెచ్‌ఎల్ సంస్థలో వెంకటస్వామి గారు అందించిన సేవలను స్మరించుకున్నారు. క్రమశిక్షణ, నిబద్ధత గల అధికారిగా ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. అనంతరం వెంకటస్వామి–పద్మావతి దంపతులను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విశ్రాంతి జీవితం సుఖసంతోషాలతో గడవాలని ఆకాంక్షించారు.
ఆత్మీయ వేడుక:
ఈ వేడుకలో కుటుంబ సభ్యులు చెన్నం మధు–శ్రీవాణి, తోట కార్తీక్–అలేఖ్యలు అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించారు. మనవళ్లు, మనవరాళ్ల సందడితో కార్యక్రమం ఎంతో కోలాహలంగా సాగింది. ఈ కార్యక్రమంలో వెంకటస్వామి బంధుమిత్రులు, పెద్ద సంఖ్యలో సహచర ఉద్యోగులు పాల్గొని ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.