భక్తిశ్రద్ధలతో 42 అడుగుల పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ.
ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కాటా సునీత రాజేష్ గౌడ్ జిన్నారం మార్చి,26,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. గ్రామంలో నూతనంగా నిర్మించిన 42 అడుగుల భారీ శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి కాటా సునీత రాజేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తుల...