బీరప్ప స్వామి జాతర మహోత్సవానికి రూ. 2 లక్షల విరాళం అందజేసిన డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్‌రావు.

పటాన్‌చెరు,మే,20,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి:ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే సంగారెడ్డి జిల్లా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్‌రావు తన ఉదారతను చాటుకున్నారు. శ్రీ భ్రమరాంబ మల్లన్న స్వామి మరియు శ్రీ శ్రీ శ్రీ కామరాతి - బీరప్ప స్వామి వార్ల కళ్యాణ (జాతర) మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, పర్స శ్యామ్‌రావు - పర్స పద్మ దంపతులు భారీ విరాళాన్ని ప్రకటించారు.బుధవారం వారి నివాసంలో గొల్ల మరియు కురుమ సంఘం పెద్దలను మర్యాదపూర్వకంగా కలిసి, జాతర మహోత్సవాల నిర్వహణ కొరకు రూ. 2,00,000/-...