MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 1:13 am Digital Edition : Shiva Kumar

బీరప్ప స్వామి జాతర మహోత్సవానికి రూ. 2 లక్షల విరాళం అందజేసిన డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్‌రావు.

పటాన్‌చెరు,మే,20,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి:ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే సంగారెడ్డి జిల్లా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్‌రావు తన ఉదారతను చాటుకున్నారు. శ్రీ భ్రమరాంబ మల్లన్న స్వామి మరియు శ్రీ శ్రీ శ్రీ కామరాతి – బీరప్ప స్వామి వార్ల కళ్యాణ (జాతర) మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, పర్స శ్యామ్‌రావు – పర్స పద్మ దంపతులు భారీ విరాళాన్ని ప్రకటించారు.బుధవారం వారి నివాసంలో గొల్ల మరియు కురుమ సంఘం పెద్దలను మర్యాదపూర్వకంగా కలిసి, జాతర మహోత్సవాల నిర్వహణ కొరకు రూ. 2,00,000/- (రెండు లక్షల రూపాయల) నగదు ఆర్థిక సహాయాన్ని వారు స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా పర్స శ్యామ్‌రావు మాట్లాడుతూ.. గ్రామీణ సంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతీకలైన జాతర మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. స్వామివార్ల కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండి, అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలని ఆయన కోరుకున్నారు. సమాజంలో కులసంఘాల బలోపేతానికి, ఇలాంటి ధార్మిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.జాతర మహోత్సవానికి ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందించి, తమకు అండగా నిలిచిన డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్‌రావు కి, పద్మ కి గొల్ల & కురుమ సంఘం పెద్దలు, నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.