బంధంకొమ్ము గ్రామంలో అంగరంగ వైభవంగా తొట్టెల ఊరేగింపు మరియు బోనాల ఉత్సవాలు.. పార్టీలకు అతీతంగా తరలివచ్చిన గ్రామస్తులు!

అమీన్ పూర్,ఆగస్టు,9,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)అమీన్ పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని బంధంకొమ్ము గ్రామంలో గ్రామస్తులు మరియు యువకుల ఆధ్వర్యంలో అమ్మవారి బోనాలు మరియు తొట్టెల ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో జరిగింది.స్థానిక శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం నుండి ప్రారంభమైన ఈ తొట్టెల ఊరేగింపు మరియు బోనాల వేడుక గ్రామ వీధుల గుండా కోలాహలంగా సాగింది. అమ్మవారికి సమర్పించే బోనాలతో మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవాయిద్యాలు, డప్పు చప్పుళ్లు, ఆటపాటల మధ్య సాగిన ఈ వేడుకల్లో చిన్నవారూ, పెద్దవారూ తేడా లేకుండా...