బంధంకొమ్ము శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ విజయోత్సవాలు.

•ముప్పై ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం.. ఘనంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తులకు భారీగా ప్రసాద వితరణ అమీన్‌పూర్,ఏప్రిల్,2,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని బంధంకొమ్ము గ్రామంలో వెలసిన శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ విజయోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు: విజయోత్సవాలను పురస్కరించుకుని ఉదయం నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు...