బాల పంచాయతీలతో సురక్షిత గ్రామాలు-బాలల భద్రతకు అందరూ తోడ్పడాలి ఎస్పీ శ్రీనివాసరావు.
బాలల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర. పాపన్నపేట,జూన్,6,మెదక్ టుడే న్యూస్:తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యక్రమంలో భాగంగా బాలల భద్రత వారోత్సవాల సందర్భంగా శనివారం పాపన్నపేట మండలంలోని మంజీరా ఫంక్షన్ హాల్లో తెలంగాణ పోలీస్ విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో, మై ఛాయస్ ఫౌండేషన్, యంగిస్తాన్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాల పంచాయతీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, నాయకత్వ లక్షణాల...