బడిబాటలో పాల్గొన్న ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలి తపస్.

చేగుంట,మే,15,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని తపస్ కార్యాలయంలో తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం మే నెలలో బడిబాట నిర్వహిస్తుంది అని, వేసవి సెలవులలో బడిబాటలో పాల్గొన్న ఉపాధ్యాయులందరికీ సంపాదిత సెలవులు మంజూరు చేయాలని వారు ప్రభుత్వానికి కోరారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా నాయకులు సురేందర్, సంతోష్, యాదగిరి, తపస్ మండల అధ్యక్షులు రావుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.