అట్టహాసంగా ఐలాపూర్ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు నర్సింగ్ రావు జన్మదిన వేడుకలు.. తరలివచ్చిన అభిమానులు, నాయకులు.
అమీన్ పూర్,ఆగస్టు,14,మెదక్ టుడే న్యూస్: (ప్రతినిధి)ఐలాపూర్ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింగ్ రావు జన్మదిన వేడుకలు వారి నివాసంలో అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య అత్యంత అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ఉమ్మడి ప్రాంతం నుంచి వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి నర్సింగ్ రావు గారికి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన నాయకులు, అభిమానులు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేయడంతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింగ్ రావు మాట్లాడుతూ.. “వేలాది మంది అభిమానుల సమక్షంలో, వారి ఆప్యాయతానురాగాల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. నాపై అపారమైన ప్రేమను కురిపిస్తూ, ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్క అభిమానికి, పార్టీ కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ అందరి అభిమానమే నాకు ఎల్లప్పుడూ శ్రీరామరక్ష” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
