📄 ePaper
Tuesday, March 10, 2026
ADS
HomeNewsఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు..

ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు..

📰 Generate e-Paper Clip

•ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు..

పాపన్నపేట,నవంబర్,16,మెదక్ టుడే న్యూస్:

పాపన్నపేట మండల పరిధిలోని నాగ్సన్ పల్లి వేణు గోపాల స్వామీ దేవాలయం ప్రాంతంలో ఆదివారం రోజు పాపన్నపేట మండల ఆర్యవైశ్య సంఘం,మహిళా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మండల ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ఎన్నుకుని ప్రమాణ స్వీకారం చేశారు.అధ్యక్షులుగా కొత్త వెంకటేశం గుప్తా, ప్రధాన కార్యదర్శిగా బెజగం విఠలేశ్వర్ గుప్తా, కోశాధికారిగా గడ్డం రాజు గుప్తా, మహిళ మండల సంఘం అధ్యక్షురాలు కొత్త సరస్వతి,ప్రధాన కార్యదర్శిగా సిద్ధంశెట్టి స్వప్న,కోశాధికారిగా కొత్త శివ జ్యోతిలు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో మండలంలోని ఆర్యవైశ్య సంఘ సభ్యులందరూ పెద్ద ఎత్తున పాల్గొని కార్తీక వనభోజనాలు స్వీకరించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments