అప్పాజీపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గం.
ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చింతల భాగయ్య, ఉపాధ్యక్షులు కన్ని బోయిన నర్సింలు. కొల్చారం,మే,26,మెదక్ టుడే న్యూస్:కొల్చారం మండలంలోని అప్పాజీపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ఎన్నికలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామంలోని ముదిరాజ్ సంఘ సభ్యులు, పెద్దలు, యువత, ప్రముఖుల సమక్షంలో జరిగిన సమావేశంలో సంఘ భవిష్యత్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, సామాజిక ఐక్యత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం ఏకగ్రీవ నిర్ణయంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.సంఘ అధ్యక్షులుగా చింతల భాగయ్య ముదిరాజ్, ఉపాధ్యక్షులుగా కన్నెబోయిన నర్సింహులు ముదిరాజ్, క్యాషియర్‌గా...