📄 ePaper
Wednesday, March 11, 2026
ADS
HomeNewsఅన్నదాతలు ఆందోళన పడొద్దు

అన్నదాతలు ఆందోళన పడొద్దు

📰 Generate e-Paper Clip

•మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

పాపన్నపేట,డిసెంబర్,31,మెదక్ టుడేన్యూస్:మండల పరిధి లోని లక్ష్మీనగర్ లోని లక్ష్మీ గ్రోమోర్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.అ కేంద్రంలో నిల్వ ఉన్న ఎరువులు,విత్తనాల స్టాక్ వివరాలను రికార్డులను పరిశీలించారు. ఎరువుల నాణ్యత,నిల్వ విధానం,విక్రయ ధరలు ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఉన్నాయా లేదా అన్న అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఎరువులు సకాలంలో అందించాలని,అక్రమ నిల్వలు,అధిక ధరలకు విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఎవరైనా సమస్యలు ఎదుర్కొంటే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. యూరియా కోసం రైతులు ఎవరు ఆందోళన చెందొద్దనీ,రైతులకు సరిపడా యూరియా ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. అక్టోబర్ 2025..జనవరి 26 సంవత్సరానికి మన జిల్లాకు 12.000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంటుందని రాష్ట్రానికి ప్రతి పాదనలు పంపామన్నారు. డిసెంబర్ 30 నాటికి మెదక్ జిల్లాకు 12.663 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందన్నారు. 8.000 మెట్రిక్ టన్నుల యూరియా రైతులు ఇప్పటివరకు కొనుగోలు చేయడం కూడా జరిగిందనీ,ఇంకా జిల్లాలో 4.000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లాలో మన అవసరానికి మించి యూరియా జనవరి కి కూడా రాబోతుందనీ రైతులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఈసందర్బంగా మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస రాజు,విస్తరణ అధికారి జనార్దన్ ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments