ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ ఘనంగా నిర్వహింపు
మెదక్ జిల్లా జులై 04 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి పి దుర్గేష్ గౌడ్ పాపన్నపేట మండలం, జూలై 4: పాపన్నపేట మండలంలోని మా పురం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కోసం శనివారం భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సబితా–దశరథం దంపతులు, ఉప సర్పంచ్‌తో పాటు గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణం త్వరగా పూర్తై, భక్తులకు ఆధ్యాత్మిక సేవలు అందించాలని శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో భక్తి, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
జై శ్రీరామ్! జై జై శ్రీరామ్! శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం! 🙏