MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 4:20 pm Digital Edition : Medak Today

అనంతపురం పి టి సి లో 1976 బ్యాచ్ ఎస్‌ఐల గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా …

హాజరైన కర్ణాటక ఎస్పి కుమార్..

(స్పెషల్ కరస్పాండెంట్)
(డా. కొమ్ము వెంకన్న బాబు)
అనంతపురం, ఏప్రిల్ 26,మెదక్ టుడే న్యూస్:
1976లో డైరెక్ట్‌గా నియామకమై అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (పి టి సి)లో శిక్షణ పొందిన ఎక్స్ ఐ, బ్యాచ్ సబ్-ఇన్‌స్పెక్టర్ల గోల్డెన్ జూబ్లీ గెట్-టుగెదర్ వేడుకలు శనివారం అనంతపురం పి టి సి ఆడిటోరియంలో అట్టహాసంగా నిర్వహించారు.
కార్యక్రమం ప్రారంభంలో బ్యాచ్‌కు చెందిన దివంగత సహచరుల స్మృతికి రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం పాల్గొన్న అధికారులు తమ 50 ఏళ్ల సేవా అనుభవాలను, వివిధ హోదాల్లో నిర్వహించిన బాధ్యతలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగంతో పంచుకున్నారు. “1976లో యువకులుగా అడుగుపెట్టిన ఈ ప్రాంగణంలోనే 50 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకోవడం జీవితంలో అరుదైన సందర్భం” అని వారు పేర్కొన్నారు.కర్ణాటక క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ ఎస్పీ శ్రీ కుమార్ గారు సతీసమేతంగా హాజరై బ్యాచ్ సభ్యులను అభినందించి, ప్రత్యేక మిఠాయిలను అందజేశారు. గిరి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హాజరైన అధికారులందరికీ టోపీలు, శాలువాలతో సన్మానించి, వారి ఫోటోలతో కూడిన జ్ఞాపికలను బహుకరించారు.ఈ గెట్-టుగెదర్ విజయవంతం కావడానికి బి. విజయ్ సింగ్, యం.యోహాన్, పి ఎస్ ఎస్ పి.బాబు తదితరులు సహకరించారు. కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన విందులో అధికారులు, వారి కుటుంబ సభ్యులు కలిసి సహపంక్తి భోజనం చేశారు.హైదరాబాద్, గుంటూరు, కర్నూల్, వరంగల్, వైజాగ్, ఏలూరు రేంజ్‌లు, హైదరాబాద్ సిటీకి చెందిన 1976 బ్యాచ్ అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్నబాబు పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తు జనరేషన్ కోసం పిటిసి ప్రాంగణంలో మామిడి మొక్కలను వివిధ రకాల నీడనిచ్చే మొక్కలను నాటారు. అనంతరం పాత జ్ఞాపకాల పునస్మరణ, ఫోటో సెషన్లు, ఆప్యాయ పలకరింపులతో వేడుకలు ఘనంగా ముగిశాయి.