📄 ePaper
Tuesday, March 10, 2026
ADS
Homeతెలంగాణ భక్తిఅమీన్‌పూర్‌లో వైభవంగా శివపార్వతుల కళ్యాణం.

అమీన్‌పూర్‌లో వైభవంగా శివపార్వతుల కళ్యాణం.

📰 Generate e-Paper Clip

•ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి దంపతులు.

  • ఆధ్యాత్మిక నిలయంగా శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం పాండురంగారెడ్డి.

అమీన్‌పూర్,ఫిబ్రవరి,16,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి,మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని శ్రీ దుర్గ భవాని మాత సహిత శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు నిర్వహించిన ఈ వేడుకకు అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి – సునీత దంపతులు, నల్ల సత్యనారాయణ రెడ్డి దంపతులు, ఎర్రొల జగన్నాథం దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామి వారి కళ్యాణాన్ని జరిపించారు.ఈ సందర్భంగా మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ..
“లోక కళ్యాణం కోసం శివపార్వతుల వివాహం జరిగిందని, అమీన్‌పూర్ పరిధిలోని ఈ శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం భక్తులందరికీ ఒక గొప్ప ఆధ్యాత్మిక నిలయంగా విరాజిల్లుతోందని కొనియాడారు. మహాశివరాత్రి పర్వదినం అంటేనే అంతా శుభం కలిగించే రోజని, పరమశివుని అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ వారు ఇంతటి వైభవంగా ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని, భక్తిభావం వల్ల సమాజంలో శాంతి నెలకొంటుందని” ఆయన పేర్కొన్నారు.పండితుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం సాగింది. కళ్యాణం అనంతరం భక్తులందరికీ భారీ స్థాయిలో అన్న ప్రసాద వితరణ చేపట్టారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కల్పన ఉపేందర్ రెడ్డి, కృష్ణ, సీనియర్ నాయకులు కొల్లూరు యాదగిరి, ఆర్కల మాణిక్ రెడ్డి, నర్సింలు, నల్ల మాధవ్ రెడ్డి, తుమ్మల ప్రభాకర్ రెడ్డి, మహేంద్ర రెడ్డి, కొండకళ్ళ శ్రీనివాస్, తుమ్మల ప్రతాప్ రెడ్డి మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments