అమీన్పూర్‌లో అంబరాన్నంటిన శ్రీరామనవమి వేడుకలు.

వేలాది మంది భక్తుల మధ్య కన్నుల పండుగగా సీతారాముల కల్యాణం అమీన్పూర్,మార్చి,27,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ గ్రామంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ పెద్దలు, భక్తుల ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణం కనుల పండుగగా సాగింది. రామనామ స్మరణతో మార్మోగిన గ్రామం అమీన్పూర్ హిందూ సమితి ఆధ్వర్యంలో రెండు రోజుల...