MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 18 February 2026, 3:41 am Digital Edition : Medak Today

అమీన్పూర్‌లో అంబరాన్నంటిన కేసీఆర్ జన్మదిన వేడుకలు: తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన కాటా సునీత రాజేష్ గౌడ్.

అమీన్పూర్,ఫిబ్రవరి,17,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి,బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలు అమీన్పూర్ డివిజన్ పరిధిలో అత్యంత ఘనంగా జరిగాయి. అమీన్పూర్ గ్రామంలోని కె.ఎస్.ఆర్.జి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర నాయకురాలు శ్రీమతి కాటా సునీత రాజు గౌడ్ ప్రారంభించారు.

ఘనంగా తెలుగు తల్లి విగ్రహావిష్కరణ

కేసీఆర్  పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద ప్రతిష్టించిన తెలుగు తల్లి విగ్రహాన్ని సునీత గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పేలా, తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీకగా ఈ విగ్రహాన్ని నేడు ఏర్పాటు చేయడం గర్వకారణంగా ఉందన్నారు.

తీన్మార్ స్టెప్పులతో హోరెత్తిన అమీన్పూర్

వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సునీత రాజు గౌడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళా కార్యకర్తలతో కలిసి తీన్మార్ స్టెప్పులు వేస్తూ ఉత్సాహంగా కేసీఆర్ గారి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. మహిళల ఆటపాటలతో అమీన్పూర్ గ్రామం పండుగను తలపించింది.

ముఖ్య అతిథి గైర్హాజరుపై వివరణ

ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల వారు హాజరుకాలేకపోయారని సునీత గౌడ్ తెలిపారు.

ప్రజా సేవకే కె.ఎస్.ఆర్.జి కార్యాలయం

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమీన్పూర్ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కొత్త కార్యాలయం పనిచేస్తుందని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసి బిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బిఆర్ఎస్ శ్రేణులు, స్థానిక నాయకులు మరియు అమీన్పూర్ మహిళలు పాల్గొని కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు..