అమీన్‌పూర్,ఫిబ్రవరి,2(మెదక్ టుడే) న్యూస్,ప్రతినిధిఅమీన్‌పూర్‌లో గత 20 ఏళ్లుగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న మినీ మేడారం జాతర విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నీలం భిక్షపతి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనపై వస్తున్న కొన్ని ఆరోపణలను తిప్పికొడుతూ, వాస్తవాలను భక్తుల ముందు ఉంచారు.న్యాయపోరాటం మరియు భూమి కేటాయింపు”అమీన్‌పూర్‌లో అమ్మవారి ఆలయం కోసం హైకోర్టు నుండి ఆర్డర్ కాపీని తెచ్చుకోవడం జరిగింది. ప్రభుత్వం మరియు న్యాయస్థానం ద్వారా ఆలయానికి జాగా కేటాయించబడింది. ఇది నా వ్యక్తిగత విజయం కాదు, అమ్మవారి కృప మరియు భక్తుల నమ్మకం.గత రెండు దశాబ్దాలుగా ఇక్కడ జాతర నిర్వహిస్తున్నాను. అమీన్‌పూర్ గ్రామ పెద్దలకు, పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలకు మరియు స్థానిక ఎమ్మెల్యే గారికి ఈ ఆలయం కోసం ఎవరు కష్టపడ్డారో, ఎవరు నిలబడ్డారో అందరికీ తెలుసు. అప్పుడు లేని వారు ఇప్పుడు వచ్చి పాత్ర లేదని ఆరోపించడం హాస్యాస్పదం.నాపై వస్తున్న ఆరోపణలకు జాతర ప్రారంభమైన రోజే (జనవరి 28న) సమాధానం చెప్పాలని అనుకున్నాను. కానీ, పవిత్రమైన జాతర మహోత్సవానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదని ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాను. జాతర విజయవంతంగా ముగిసిన తర్వాతే ఈ వివరణ ఇస్తున్నాను.”ప్రచారం కోసం కాదు.. సేవ కోసం:”ప్రచారం కోసం పాకులాడే మనస్తత్వం నాది కాదు. కష్టపడి ఆలయాన్ని నిర్మించాం, అమ్మవారి సాక్షిగా అందరికీ నిజాలు తెలుసు. సరైన సమయం వచ్చినప్పుడు మరిన్ని పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచుతాను. నన్ను నమ్ముకున్న ప్రజలందరికీ, భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి.ఎవరో ఏదో అన్నారని కంగారు పడాల్సిన పనిలేదు. అమీన్‌పూర్ ప్రజలకు, మీడియా మిత్రులకు ఈ ఆలయ ప్రస్థానం గురించి పూర్తి అవగాహన ఉంది. ఆరోపణలు చేసే వారు చేస్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరుగా ఉన్నాయి.”— నీలం భిక్షపతి (ఆలయ చైర్మన్)