అమీన్‌పూర్ పరిధిలో ఆగని బుల్డోజర్లు: అక్రమ కట్టడాల కూల్చివేత
ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు: తహసీల్దార్ వెంకటేష్ హెచ్చరిక అమీన్‌పూర్,మార్చి,26,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ మండల పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై రెవెన్యూ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. అక్రమంగా వెలుస్తున్న కట్టడాలను రెవెన్యూ అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. గురువారం అమీన్‌పూర్ తహసీల్దార్ వెంకటేష్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతల వివరాలు: ఐలాపూర్ గ్రామం: ఇక్కడ సర్వే నంబర్ 823 లోని ప్రభుత్వ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన...