అమీన్‌పూర్ మండలంలో పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం: ఎంఈఓ సుధాకర్.
మండల వ్యాప్తంగా 7 పరీక్షా కేంద్రాల ఏర్పాటు •మొత్తం 1460 మంది విద్యార్థులు హాజరు •పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అమీన్‌పూర్,మార్చి,13,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ మండల పరిధిలో ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి సుధాకర్ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించామని ఆయన పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల...