MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 3:22 pm Digital Edition : Medak Today

అమీన్‌పూర్ మండలంలో పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం: ఎంఈఓ సుధాకర్.

మండల వ్యాప్తంగా 7 పరీక్షా కేంద్రాల ఏర్పాటు

    •మొత్తం 1460 మంది విద్యార్థులు హాజరు

    •పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ

    అమీన్‌పూర్,మార్చి,13,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ మండల పరిధిలో ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి సుధాకర్ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించామని ఆయన పేర్కొన్నారు.

    పరీక్షా కేంద్రాల వారీగా విద్యార్థుల వివరాలు:

    మండలంలోని మొత్తం 7 కేంద్రాలలో 1460 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కేంద్రాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి:

    క్రమసంఖ్య పరీక్షా కేంద్రం పేరు విద్యార్థుల సంఖ్య

    1 శ్రీ చైతన్య స్కూల్, అమీన్‌పూర్ 240,
    2 సాయి స్కూల్, బీరంగూడ 240
    3 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , బీరంగూడ 200
    4 లైఫ్ లైన్ స్కూల్, సాయి కాలనీ 220
    5 డార్విన్ స్కూల్, బీరంగూడ 160
    6 సాయి హైస్కూల్, కిష్టారెడ్డిపేట 200
    7 శ్రీనిధి స్కూల్ 200
    మొత్తం విద్యార్థులు 1460..

    ఎంఈఓ సుధాకర్ సూచనలు:

    ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతాయని, విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.నిబంధనలు: పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు లేదా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని స్పష్టం చేశారు.వసతులు: ప్రతి కేంద్రం వద్ద తాగునీరు, వెలుతురు మరియు ఫర్నిచర్ వంటి సౌకర్యాలను పర్యవేక్షించామన్నారు.భద్రత: పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఇన్విజిలేటర్లకు తగిన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరూ ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.