అమీన్‌పూర్ గ్రామంలో ఘనంగా ఇఫ్తార్ విందు: ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.
అమీన్‌పూర్,ఫిబ్రవరి,27,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని అమీన్‌పూర్ గ్రామంలోని మస్జిద్-ఈ-ఆలంగీర్ వద్ద ఇఫ్తార్ విందు అత్యంత వైభవంగా జరిగింది. మహమ్మద్ మోయిన్ ఖాన్ (అలియాస్ బాబా బాయ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 800 మంది ముస్లిం సోదరులు పాల్గొని సామూహిక ప్రార్థనల అనంతరం ఇఫ్తార్ విందును స్వీకరించారు.ఈ కార్యక్రమానికి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారితో పాటు అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్...