అమీన్‌పూర్ అక్రమ తైబజార్ వసూళ్లపై డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ సీరియస్ హెచ్చరిక: జైలు శిక్ష తప్పదు!

వ్యాపారులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: డిప్యూటీ కమిషనర్ అమీన్‌పూర్,మే,1,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి,సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలో తైబజార్ పేరుతో సాగుతున్న అక్రమ వసూళ్లపై అమీన్‌పూర్ జిహెచ్‌ఎంసి డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ తీవ్రంగా స్పందించారు. గడువు ముగిసినప్పటికీ ప్రజలను, చిరు వ్యాపారులను ఇబ్బంది పెడుతూ అక్రమంగా డబ్బులు వసూలు చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఆదేశాలు: తైబజార్ వసూళ్లపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ కమిషనర్ స్పందిస్తూ క్షేత్రస్థాయి...