అమీన్‌పూర్‌లో హైడ్రా అధికారుల తీరుపై నిరసన:న్యాయవాది కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. సీఐకి ఫిర్యాదు.
అమీన్‌పూర్,మే,29,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని ఐలాపూర్‌లో హైడ్రా అధికారుల చర్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కూల్చివేతకు గురైన గెస్ట్ హౌజ్ స్థలంలో అధికారులు ఫెన్సింగ్ పనులు చేపడుతుండగా, స్థానిక న్యాయవాది ముఖీం ప్రతినిధులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో మహిళా సిబ్బంది పట్ల అధికారులు అనుచితంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.పద్మ ఆరోపణలు: "మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు"ఈ ఘటనపై ఘటనా స్థలంలో ఉన్న పద్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ, "మా యజమాని (న్యాయవాది ముఖీం) న్యాయపరంగా...