అమీన్ పూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు.. పోటెత్తిన భక్తసందోహం.
అమీన్ పూర్,ఆగస్టు,9,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్ పూర్ గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామ దేవతల బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. గ్రామ సరిహద్దులోని కొలువైన శక్తి స్వరూపిణులు నాగులమ్మ, పోచమ్మ, నల్ల పోచమ్మ, ముత్యాలమ్మ తల్లుల ఆలయాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాతల కాలం నుంచి ఆచారంగా వస్తున్న ఈ పండుగను గ్రామస్తులందరూ పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపై నిలిచి అట్టహాసంగా జరుపుకోవడం విశేషం. ఉదయం నుంచే ఆలయాల వద్దకు భక్తులు...