అక్షర యోధుల పోరాటానికి ఫలితం.లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సాధనమీడియా కృషితోనే ప్రజల ఆకాంక్ష నెరవేరింది.

పాత్రికేయుల సేవలను కొనియాడిన మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. (స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,మే,24,మెదక్ టుడే న్యూస్:లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సాధనలో మీడియా పోషించిన పాత్ర అమూల్యమని మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రశంసించారు. ప్రారంభం నుంచి చివరి వరకు పాత్రికేయులు అక్షరాయుధంతో ప్రజల తరఫున పోరాడి పాలకులను అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. జలాశయ సాధనే లక్ష్యంగా వార్తలు, కథనాలు ప్రచారం చేసి ప్రజా సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా కీలకంగా వ్యవహరించిందన్నారు.ఈ సందర్భంగా పాత్రికేయుల తరఫున సీనియర్ జర్నలిస్ట్ కేపీకి,...