MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 8:34 am Digital Edition : Shiva Kumar

ఎయిర్ ఫోర్స్‌లో ఎయిర్‌మెన్‌గా ఎంపికైన పోలీస్ దిలీప్‌కు జిల్లా ఎస్పీ అభినందనలు.

మెదక్,జూన్,11,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)అక్కన్నపేట గ్రామానికి చెందిన పోలీస్ దిలీప్ అగ్నివీర్ పథకం ద్వారా భారత వైమానిక దళం (ఎయిర్ ఫోర్స్)లో ఎయిర్‌మెన్‌గా ఎంపికైన సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఎయిర్‌మెన్ ఎంపికలో 7వ ర్యాంకు సాధించిన దిలీప్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో భారత వైమానిక దళంలో డిపార్ట్‌మెంటల్ పరీక్షలు రాసి మరింత ఉన్నత పదవులు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి తమ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. యువతలో చాలామంది వ్యసనాలకు అలవాటుపడి తమ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారని, అలాంటి వారికి దిలీప్ ఆదర్శంగా నిలుస్తాడని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పట్టుదల, క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని దిలీప్ నిరూపించాడన్నారు. దిలీప్ సాధించిన విజయం అక్కన్నపేట్ గ్రామంతో పాటు మెదక్ జిల్లాకు గర్వకారణమని, మరెందరో యువతకు స్ఫూర్తినిచ్చేలా ఉందని ఎస్పీ తెలిపారు. దిలీప్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.