అభివృద్ధిలో అమీన్‌పూర్, బీరంగూడలను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

అమీన్‌పూర్,మే,20,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్, బీరంగూడ డివిజన్ల పరిధిలోని ప్రతి కాలనీని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, అమీన్‌పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ మరియు వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమీన్పూర్ డివిజన్, బీరంగూడ డివిజన్ పరిధిలో...