MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 1:21 am Digital Edition : Shiva Kumar

50 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలు చేగుంట మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్.

చేగుంట,మే,24,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలో పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడే జీలుగ విత్తనాలు 50 శాతం సబ్సిడీపై అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ తెలిపారు. వర్షాకాలం పంటల సాగుకు ముందు భూసారాన్ని పెంచేందుకు ఈ పచ్చిరొట్ట ఎరువులు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. మార్కెట్‌లో 30 కిలోల జీలుగ విత్తనాల బస్తా పూర్తి ధర రూ. 4,905 కాగా, ప్రభుత్వం కల్పిస్తున్న 50 శాతం సబ్సిడీ పోను రైతులు కేవలం రూ. 2,451 చెల్లించి ఈ విత్తనాలను పొందవచ్చునని వివరించారు. ఈ సబ్సిడీ విత్తనాలు కావలసిన మండల పరిధిలోని రైతులు తమ పట్టాదార్ పాస్‌బుక్, ఆధార్ కార్డులను తీసుకువచ్చి విత్తనాలను పొందాలని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ కోరారు.