(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్,మే,2,మెదక్ టుడే న్యూస్: టీఎన్జీవో షాద్‌నగర్ తాలూకా అధ్యక్షుడిగా ఎన్నికైన హెల్త్ ఎడ్యుకేటర్ జక్కుల శ్రీనివాసులకు సాయిబాబా కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని 6వ వార్డు పరిధిలో గల సాయిబాబా కాలనీలోని శివాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాలనీవాసులు, పెద్దలు, యువకులు భారీ సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు.
కార్యక్రమానికి కమిటీ అధ్యక్షుడు మంగ శంకర్ (ASSG) అధ్యక్షత వహించగా, సమన్వయకర్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి గ్రామ శ్రీనివాసులు సమగ్రంగా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమ ప్రారంభంలో అతిథులను ఆహ్వానించి, అనంతరం జక్కుల శ్రీనివాసులకు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ, జక్కుల శ్రీనివాసులు తాలూకా అధ్యక్ష పదవికి అర్హుడని, ఆయనకు ఉన్న సేవాభావం, నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న కట్టుబాటు ఆయనను ఈ స్థాయికి చేర్చాయని కొనియాడారు. ముఖ్యంగా సమన్వయకర్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు మాట్లాడుతూ, శ్రీనివాసులు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రజలకు చేరువయ్యారని, ఉద్యోగులతో పాటు సాధారణ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని తెలిపారు.
కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ఏ. ఆంజనేయులు గౌడ్, మాజీ అధ్యక్షులు బోర్వెల్ శ్రీరాములు గౌడ్, అమర్నాథ్ రెడ్డి, నాట్కో చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ న్యాయవాది బెన్నూరి చంద్రయ్య, టిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు 26వ వార్డు కౌన్సిలర్ బి శివ (ఎస్ పి), రామిరెడ్డి, డీసీఎం సుధాకర్ రెడ్డి, ఐటి రాజేష్ కుమార్, గుంటి రమేష్, మందారం నరసింహులు, రిటైర్డ్ ఆర్టీసీ బాలస్వామి, రమణారెడ్డి, పురుషోత్తం రెడ్డి, క్యాషియర్ శ్రీశైలం, పోలీస్ రవి, విష్ణు (లడ్డు), సతీష్, కుమార్, అజయ్, బోల్ట్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
సన్మాన కార్యక్రమానికి ప్రతిస్పందించిన జక్కుల శ్రీనివాసులు మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకానికి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అన్ని విభాగాల ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ, ముఖ్యంగా కాలనీ వాసులకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.చివరగా ప్రధాన కార్యదర్శి బొబ్బిలిగామ శ్రీనివాసులు సభకు వందన సమర్పణ గావించి, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

