(కరస్పాండెంట్ )
షాద్నగర్,ఏప్రిల్,18,మెదక్ టుడే న్యూస్:
షాద్నగర్ తాలూకాలోని పింఛనర్స్ భవన్‌లో ఈరోజు సాయంత్రం 5 గంటలకు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టీఎన్జీవో) తాలూకా స్థాయి ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా శ్రీ పాలు బాయ్ ఈశ్వర్ వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా యూనియన్ నాయకులు శ్రీ శ్రీనివాస్, యశ్వంత్, రంగయ్య, ఆనంద్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో షాద్నగర్ తాలూకా టీఎన్జీవో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన సభ్యులు ఈ విధంగా ఉన్నారు:
అధ్యక్షుడు: జె. శ్రీనివాసులు (హెల్త్ ఎడ్యుకేటర్)
ప్రధాన కార్యదర్శి: శ్రీహరి (వీఆర్వో)
ముఖ్య సలహాదారు: శ్రీనివాసరాజు (లైబ్రేరియన్)
ఉపాధ్యక్షుడు: రాజశేఖర్ (ఫార్మసిస్ట్)
ఖజాంచీ: మహేందర్ గౌడ్
జాయింట్ సెక్రటరీ: డి. విజయలక్ష్మి (ఐసిడిఎస్)
పబ్లిసిటీ సెక్రటరీ: ప్రసన్నలత (సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం)
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు: ఎస్. రజని, ఎం. నరసింహ
అలాగే నామినేటెడ్ పోస్టులుగా హరీష్ రాజు, చరణ్‌లను ఎంపిక చేశారు.
ఎన్నికల అనంతరం ఎన్నికల అధికారి ఈశ్వర్ చేతుల మీదుగా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు జె. శ్రీనివాసులు మాట్లాడుతూ, ఎన్నికలు నిర్వహించిన జిల్లా మరియు కేంద్ర యూనియన్ నాయకులకు, అలాగే స్థానిక ఉద్యోగ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. టీఎన్జీవో అధ్యక్షుడిగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.