షాద్‌నగర్ తాలూకా ఉద్యోగ సంఘాల జేఏసీ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక.

(స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,మే,3,మెదక్ టుడే న్యూస్: షాద్‌నగర్ తాలూకాలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఒక బలమైన వేదిక అవసరమనే ఉద్దేశంతో ఈ కమిటీని రూపొందించారు.జేఏసీ చైర్మన్‌గా టీఎన్జీవో ప్రెసిడెంట్, హెల్త్ ఎడ్యుకేటర్ జక్కుల జె. శ్రీనివాస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సెక్రటరీ జనరల్‌గా టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నాయిని నర్సింలుగౌడ్, వైస్ చైర్మన్లుగా పిఆర్‌టియు ప్రెసిడెంట్ ఏ. శ్రీధర్ రెడ్డి, టీజీయూఎస్...