(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్,మే,3,మెదక్ టుడే న్యూస్:
షాద్‌నగర్ తాలూకాలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఒక బలమైన వేదిక అవసరమనే ఉద్దేశంతో ఈ కమిటీని రూపొందించారు.
జేఏసీ చైర్మన్‌గా టీఎన్జీవో ప్రెసిడెంట్, హెల్త్ ఎడ్యుకేటర్ జక్కుల జె. శ్రీనివాస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సెక్రటరీ జనరల్‌గా టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నాయిని నర్సింలుగౌడ్, వైస్ చైర్మన్లుగా పిఆర్‌టియు ప్రెసిడెంట్ ఏ. శ్రీధర్ రెడ్డి, టీజీయూఎస్ జిల్లా ప్రెసిడెంట్ వి. తౌర్యలను ఎంపిక చేశారు.ఇతర పదవుల్లో:
వి. రామారావు (రిటైర్డ్ ఎమ్మార్వో),
రఘురాం (వార్డెన్),
పద్మ నళిని (జీహెచ్ఎం),
విజయ (ఐసీడీఎస్ సూపర్వైజర్)
ట్రెజరర్‌గా రెవెన్యూ విభాగానికి చెందిన శ్రీహరిను నియమించారు.డిప్యూటీ సెక్రటరీ జనరల్స్‌గా:
ఆనంద్ సింగ్ (డిప్యూటీ తహసీల్దార్), మహేష్ (ఎస్‌టిఓ), జె. లక్ష్మీదేవమ్మ (టీచర్), సురేష్ (రిటైర్డ్ టీచర్), నాగేష్ (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, కొత్తూరు)లను ఎన్నుకున్నారు.
కో-చైర్మన్లుగా:బిజిలి సత్యం, జి. శ్రీనివాసరాజు (లైబ్రేరియన్, కొత్తూరు), నాజర్ అలీ, జనార్ధన్, రమేష్ (సీనియర్ అసిస్టెంట్, మున్సిపల్ ఆఫీస్), కే. వెంకటయ్య, జె.సి. వెంకటయ్య, కృష్ణయ్యలను ఎంపిక చేశారు.సోషల్ మీడియా కన్వీనర్‌గా ఏ. వినీత్ బాబు (కేశంపేట), ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా సతీష్ కుమార్ (విఆర్‌ఓ, కేశంపేట), ఫరీద్ (ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్)లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా చైర్మన్ జక్కుల శ్రీనివాస్ మాట్లాడుతూ—ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అన్ని సంఘాలు ఐక్యంగా పనిచేయాలని, ప్రభుత్వం దృష్టికి సమస్యలను సమిష్టిగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఏ ఉద్యోగికి సమస్య వచ్చినా, అన్ని సంఘాలు కలసి ముందుకు రావాలని ఆయన కోరారు.
