(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్ నగర్,మార్చి,26,మెదక్ టుడే న్యూస్:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా బి. జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో ఆయన కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపొందడం విశేషం.
తన సమీప ప్రత్యర్థి, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్వ వేణుగోపాలరావు 66 ఓట్లు సాధించగా, జగన్మోహన్ రెడ్డి 67 ఓట్లు పొందారు. దీంతో ఒక్క ఓటుతో ఆయన గెలుపు సాధించారు.గురువారం నిర్వహించిన ఈ ఎన్నికలకు అధికారి గా మర్రి శంకరయ్య వ్యవహరించారు. అధ్యక్ష పదవికి మొత్తం నలుగురు అభ్యర్థులు పోటీపడగా, దానక్క సంగమేశ్వర్ 23 ఓట్లు, సీనియర్ న్యాయవాది రజాక్ హుస్సేన్ కేవలం 5 ఓట్లు పొందారు.ఇక ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా రహీముద్దీన్ 108 ఓట్లు సాధించగా, గేమ్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా డి. శంకర్ 102 ఓట్లు పొందారు.గతంలో పలుమార్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి, కోర్టు ప్రాంగణ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన విషయం తెలిసిందే. ఆయన సేవలకు గుర్తింపుగానే ఈ విజయం లభించిందని న్యాయవాదుల వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.తన అనుభవం, నాయకత్వంతో బార్ అసోసియేషన్‌ను మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తారని సహచర న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.