శ్రీకృష్ణ నగర్ కాలనీ ముఖద్వారం ప్రారంభం – దాతల సహకారం అభినందనీయం
అమీన్‌పూర్,జనవరి,31,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలో నూతనంగా ఏర్పడిన అమీన్‌పూర్ మరియు బీరంగూడ డివిజన్ల సమగ్ర అభివృద్ధికి తమ వంతు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం బీరంగూడ డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన కాలనీ ముఖద్వారాన్ని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.ఈ కాలనీ ముఖద్వారాన్ని శ్రీమతి ఎలగడి నర్సమ్మ మరియు దాస్ యాదవ్ దంపతులు తమ సొంత నిధులతో అత్యంత సుందరంగా నిర్మించారు. కాలనీపై ఉన్న మక్కువతో, ప్రజా ప్రయోజనం కోరి వారు చేసిన ఈ విరాళాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రస్తావించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు.ప్రభుత్వంతో పాటు కాలనీల అభివృద్ధిలో శ్రీమతి ఎలగడి నర్సమ్మ – దాస్ యాదవ్ వంటి దాతలు ముందుకు రావడం అభినందనీయం. సొంత నిధులతో కాలనీ ముఖద్వారాన్ని నిర్మించి ఆదర్శంగా నిలిచిన వీరి సేవలు ఎంతో గొప్పవి” అని ఎమ్మెల్యే వారిని ప్రత్యేకంగా అభినందించారు.లక్ష్యం: ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా తమ పాలన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ మాజీ కౌన్సిలర్స్ కృష్ణ, ఉపేందర్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, మాది కో ఆప్షన్ నెంబర్ తలారి రాములు,చంద్రశేఖర్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కొల్లూరు యాదగిరి, జనార్దన్ రెడ్డి, ప్రసాద్ రావు, మహేష్ ముదిరాజ్, ఇతర మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు శ్రీకృష్ణ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

