డిసెంబర్ 1నసమాచార భవన్ ఎదుట జర్నలిస్టుల ధర్నా
(స్టేట్ బ్యూరో)హైదరాబాద్,నవంబర్,29,మెదక్ టుడే న్యూస్: దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ ఒకటిన "ఛలో సమాచార భవన్" హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార శాఖ కమీషనరేట్(సమాచారభవన్) ఎదుట జర్నలిస్టుల ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు,రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ మామిడి సోమయ్య తెలిపారు.శనివారం ఆయన ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కో-కన్వీనర్లు వల్లాల జగన్, బండి విజయ్ కుమార్, తన్నీరు శ్రీనివాస్ తదితరులతో కలిసి మీడియా సమావేశంలో...