MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 5:14 pm Digital Edition : Medak Today

ఢాకా వేదికగా జరిగిన అంతర్జాతీయ మహిళల కబడ్డీ ప్రపంచ కప్ 2025 టైటిల్ సాధించిన భారత మహిళలకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శుభాభినందనలు..

(స్టేట్ బ్యూరో)నవంబర్,24,మెదక్ టుడే న్యూస్:

ఢాకా వేదికగా జరిగిన అంతర్జాతీయ మహిళల కబడ్డీ ప్రపంచ కప్ 2025 టైటిల్ సాధించిన భారత మహిళలకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలియజేశారు. ఫైనల్స్ లో అత్యుత్తమ ఆటను ప్రదర్శించి చైనీస్ తైపీపై 35-28 పాయింట్ల తేడాతో విజయం సాధించి వరుసగా రెండో ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకుని భారత కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటారని కొనియాడారు.అవకాశం ఇస్తే తమలోని ప్రతిభా పాటవాలని ప్రదర్శించి విజేతలుగా నిలుస్తారనడానికి మన మహిళలు నిదర్శనమని అన్నారు. మహిళల జట్టు విజయం ఉన్నత లక్ష్యాలను సాధించాలనుకునే యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు.