డెస్క్ జర్నలిస్టులందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాం,బస్ పాస్ లతో సహా ఇతర అన్ని సంక్షేమ పథకాలు వారికి వర్తింపజేయిస్తాం,అవాస్తవాలతో కొందరు తప్పుద్రోవ పట్టిస్తున్నారు.-టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ..
హైదరాబాద్:డిసెంబర్,28, మెదక్ టుడే న్యూస్:(స్టేట్ బ్యూరో)జర్నలిస్టుల సంక్షేమం కోసం గత 70 ఏళ్లుగా పాటుపడుతున్న తమ సంఘం డెస్క్ జర్నలిస్టులకు ప్రభుత్వం అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, బస్ పాస్ లతో సహా అన్ని సంక్షేమ పథకాలను వారికి వర్తింపజేసేందుకు తాము ప్రభుత్వంతో చర్చించి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ భరోసా ఇచ్చారు. డెస్క్ జర్నలిస్టులను ఇతర జర్నలిస్టులను తాము వేరుగా చూడడం లేదని, వారికి కూడా బస్...