MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 2:38 pm Digital Edition : SHIVA KUMAR

రహదారుల పై ధాన్యం ఆరబోయవద్దు -ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్.

పాపన్నపేట,మే,4,మెదక్ టుడే న్యూస్:మండలంలో రహదారుల పై ధాన్యం ఆరబోసిప్రమాదాలకు కారణమైతే చర్యలు తప్పవని ఎస్సై శ్రీనివాస్ గౌడ్
అన్నారు.సోమవారం ఆయన ఎల్లపూర్,మిన్ పూర్, యూసుఫ్ పేట, కొత్తపల్లి గ్రామాల శివార్లలో మెదక్ — బొడ్మట్ పల్లి రహదారి పై ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడుతూ…రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.ధాన్యం కుప్పల పక్కన రాళ్లు, కర్రలు పెడుతున్నారని రాత్రివేళ అవి వాహనదారులకు కనిపించక పెద్ద ప్రమాదాలు జరిగే ఆస్కారంఉందన్నారు.వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఖాళీ ప్రదేశాలలోధాన్యంఆరబోసుకోవాలన్నారు.ధాన్యం కుప్పల వద్ద ప్రమాదాలు జరిగితే చర్యలు తప్పవన్నారు.ప్రజల ప్రయోజనార్థం చర్యలు తీసుకుంటున్నట్లుచెప్పారు.రైతులుసహకరించాలనిసూచించారు.ఆయన వెంట హెడకానిస్టేబుల్ అంజయ్య, కానిస్టేబుల్ లు ప్రవీణ్,వసంత్,మధులుతదితరులున్నారు.