బీహార్‌లో రెండో దశ అసెంబ్లీ పోలింగ్‌కు సర్వం సిద్ధం
భద్రత కట్టుదిట్టం న్యూఢిల్లీ, నవంబర్ 10 :బీహార్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి దశలో 121 స్థానాల్లో ఓటింగ్ జరగగా, మిగిలిన 122 స్థానాలకు మంగళవారం రెండో దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ దశలో మొత్తం 1302 మంది అభ్యర్థులు ప్రజాభిప్రాయ పరీక్షకు హాజరవుతున్న దాదాపు నాలుగు కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. రెండో దశలో పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామఢి, మధుబని, సుపౌల్, అరేరియా, కిషన్‌గంజ్ వంటి జిల్లాల్లో ఓటింగ్ జరగనుంది....