బీరంగూడలో వర్షాల బీభత్సం: అపార్ట్‌మెంట్ సెల్లార్లలోకి వరద నీరు.. జలమయమైన వాహనాలు

అమీన్ పూర్, జూన్ 23:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి  బీరంగూడ డివిజన్ పరిధిలో వర్షాలు అపార్ట్‌మెంట్ వాసుల పాలిట శాపంగా మారాయి. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ, అక్రమ నిర్మాణాల కారణంగా ప్రతి వర్షానికి స్థానికులు నరకం చూస్తున్నారు. తాజాగా శ్రీ గురు రాఘవేంద్ర అపార్ట్‌మెంట్, నవ్య ప్రైడ్ అపార్ట్‌మెంట్లలో నివాసితులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. *సెల్లార్లలోకి వరద.. మునిగిన వాహనాలు* సుమారు 36 కుటుంబాలు నివసించే శ్రీ గురు రాఘవేంద్ర అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో అక్కడ పార్క్ చేసిన మూడు...