MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 8:35 am Digital Edition : UPPARI RAJU

ప్రజాసేవలో హరీష్ రావు గారిది గొప్ప స్ఫూర్తి: కాట సునీత రాజేష్ గౌడ్

అమీన్ పూర్, జూన్ 03,

(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి 

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాట సునీత రాజేష్ గౌడ్ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, కేక్ కట్ చేయించి ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కాట సునీత రాజేష్ గౌడ్ హరీష్ రావు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ…

“నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న హరీష్ అన్న గారు మా అందరికీ గొప్ప స్ఫూర్తి. కష్టకాలంలో పార్టీని నిలబెట్టడంలో, కార్యకర్తలకు అండగా నిలవడంలో ఆయన చూపే చొరవ అభినందనీయం. తెలంగాణ అభివృద్ధిలో, ప్రత్యేకించి నీటి పారుదల రంగంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ఆయన ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు వర్ధిల్లుతూ ప్రజాసేవలో మరిన్ని ఉన్నత పదవులను అధిష్టించి, మమ్మల్ని మరింత ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,” అని పేర్కొన్నారు.హరీష్ రావు గారి నాయకత్వంలో పనిచేయడం తమకు గర్వకారణమని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పార్టీ బలోపేతం కోసం తామంతా కృషి చేస్తామని సునీత రాజేష్ గౌడ్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు

.