నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు

పటాన్ చెరు, జూన్ 01, (మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి  భౌతికశాస్త్ర ఉపాధ్యాయులను నాణ్యమైన శిక్షణతో ప్రోత్సహించి, ఆ రంగాన్ని అభివృద్ధి చేయాలనే విద్యాపరమైన బాధ్యతగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు స్పష్టీకరించారు. ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల వృత్తి వికాస కార్యక్రమం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఇండియన్ ఫిజిక్స్ అసోసియేషన్ (ఐపీఏ) విశాఖపట్నం...