అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని ఓడిఎఫ్ కాలనీలో వర్షపు నీటితో అల్లాడుతున్న ప్రజలు
అమీన్‌పూర్, జూన్ 23:మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని ఓడిఎఫ్ కాలనీ వాసులకు వర్షం ఒక శాపంగా మారింది. నిన్న రాత్రి కురిసిన స్వల్ప వర్షానికే కాలనీ అస్తవ్యస్తమైంది. డ్రైనేజీ వ్యవస్థ అద్వాన్నంగా ఉండటంతో, వర్షపు నీరు రోడ్ల మీద పారడమే కాకుండా, నేరుగా ఇళ్లల్లోకి చేరుతోంది. దీంతో కాలనీవాసులు నరకప్రాయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు." ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే.. చిన్నపాటి వర్షం కురిసినా చాలు, కాలనీలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. సరైన డ్రైనేజీ వసతి లేకపోవడంతో మురుగునీరు, వర్షపు నీరు...