అమీన్‌పూర్‌లో భారీ వర్షాల బీభత్సం: కాలనీల్లో నిలిచిన నీరు, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు
అమీన్‌పూర్, జూన్ 23:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి రాత్రి కురిసిన భారీ వర్షానికి అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని దినేష్ హోమ్స్ మరియు నారాయణరెడ్డి కాలనీలు జలమయమయ్యాయి. రోడ్ల మీదకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల గోడలు కూలిపోగా, రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మాజీ కౌన్సిలర్ నవనీత జగదీష్ గారు వెంటనే స్పందించి, క్షేత్రస్థాయిలో పర్యటించారు. జేసీబీ సహాయంతో నీటిని బయటకు పంపేలా మరియు మురుగునీటి వ్యవస్థను పునరుద్ధరించేలా సహాయక చర్యలను...