అమీన్‌పూర్‌లో జలదిగ్బంధం: సాయిరాం ఫేస్-1, నరేంద్ర కాలనీల వద్ద నిలిచిపోయిన రాకపోకలు

అమీన్‌పూర్, జూన్ 23:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి  రాత్రి కురిసిన భారీ వర్షాలకు అమీన్‌పూర్ పరిధిలోని సాయిరాం ఫేస్-1 మరియు నరేంద్ర కాలనీ టర్నింగ్ పాయింట్ వద్ద రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లడానికి దారి లేక రోడ్లపైనే నిలిచిపోయాయి. దీనివల్ల స్థానికుల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. *అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం* ఈ సమస్యపై కాలనీవాసులు మాట్లాడుతూ, "గతంలో మున్సిపాలిటీగా ఉన్నప్పటి నుంచి అధికారులకు పలుమార్లు విన్నవించినా, వారు కేవలం తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతున్నారు. అండర్...